5674) నా ప్రియా యేస్సయా నా ప్రాణనాథుడా

** TELUGU LYRICS **

నా ప్రియా యేస్సయా - నా ప్రాణనాథుడా 
నీవె లేకుండా ఇలలో - జీవించలేనయ్యా (2)
నన్ను ఎడబాయని - పరమాత్ముడా (2)
మరణము గెలిచిన - జయశీలుడా (2)

మాలొ ఒకడిగ పుట్టినదేవా - ఎన్నో క్రియలు చేసితివయ్యా 
వేవేల కాంతులకన్నా - తెజ్యోమయుడవు నీవయ్యా (2)
నా కోసమే దిగి ఓచ్చావు - పరలోకము నాకు ఇచ్చావు (2)
భజనలు చేసి నిన్ను నేను - ఆరాధిస్తానయ్యా 
విరిగినలిగిన హృదయమును - అర్పిస్తానయ్యా (2) 

నీ జన్మమే ఆశీర్వాదముగా - చీకటి లోకపు వెలుగవంగా  
నా జీవితములోన శాంతి - ప్రసాదించావయ్యా (2)
పాపము కమ్మిన లోకములో - పరిశుద్ధత నాకిచ్చావు (2)
నాలో వెలుగును నింపిన జీవనజ్యోతివి నీవయ్యా 
అన్ని వేలలా నిన్ను నేను కీర్తిస్తానయ్యా (2) 

నా దేహమె  నీ దేవాలయము - నీ త్యాగమె  రక్షణకారణము 
మోక్ష్యాన్ని చేరుట కొరకు మార్గము చూపించావయ్యా (2) 
నీ చిత్తము గ్రహించుటకు - నీ వాక్యము నాకు ఇచ్చావు (2) 
అన్నిటిలో ప్రాధాన్యతను నీకే ఇస్తానయ్యా 
జీవితమంతా నీతోనే పయనిస్తానయ్యా (2) 
||నా ప్రియా||

----------------------------------------------------------
CREDITS : HALLELUIA MINISTRIES
Vocals : A R Steven Son
Lyrics : Apostle Mancha Elia 
----------------------------------------------------------