5642) ఆరాధనీయుడా నా యేసయ్యా అద్బుతములు నీ కార్యములూ

** TELUGU LYRICS **

ఆరాధనీయుడా నా యేసయ్యా
అద్బుతములు నీ కార్యములూ

నా దీన స్థితిలో నా తోడై యుండీ
నను ఓదార్చిన నా యేసయ్యా
నీ కృపాతి శయములనే
నిత్యము ప్రకటించెదను
నీకే ఆరాధనా నా యేసయ్యా
నీకే ఆరాధనా
||ఆరాధనీయుడా||

దూతలు చేయని ఘనమైన సేవను
చేయుటకూ నాకు కృప నిచ్చితివే
నా బ్రతుకు దినము లన్నీ
నీ నామమునే ఘన పరచెదనూ
నీకే ఆరాధనా నా యేసయ్యా
నీకే ఆరాధనా నా యేసయ్యా నీకే ఆరాధనా
||ఆరాధనీయుడా||

-------------------------------------------------------------------------------------------
CREDITS : Raheboth Prayer Fellowship, Bishop K.Joseph
-------------------------------------------------------------------------------------------