5617) తండ్రీ పరమ తండ్రీ తండ్రీ నా కన్న తండ్రీ

** TELUGU LYRICS **

తండ్రీ పరమ తండ్రీ
తండ్రీ నా కన్న తండ్రీ
ఎప్పుడంటే అప్పుడు - ఎక్కడంటే అక్కడ 
తండ్రీ అని నిను పిలిచే - ఈ భాగ్యమెంత గొప్పది (2)
రేయైనా పగలైనా రాత్రందు ఏజామైనా (2)
తండ్రీ అని నిను చేరే ప్రతిసమయమెంత గొప్పది 
ఓ ఓ ఓ తండ్రీ అని నిను చేరే ప్రతిసమయమెంత గొప్పది
తండ్రీ - తండ్రీ - తండ్రీ - నా కన్న తండ్రీ 
తండ్రీ - తండ్రీ - తండ్రీ - నా పరమ తండ్రీ 

రాత్రి కలుగు భయముకైనా - పగలు ఎరుగు బాణముకైనా 
చీకటిలో తెగులైనా - పాడుచేయు రోగముకైనా (2)
నాపైన లేదుగా ఏ అధికారము - నాకేల భయము నీవేగా కారణము 
దేవా నీరెక్కలతో నను కప్పుము - దేవా నీ కృపతో తృప్తి పరచుము (2)
||ఎప్పుడంటే||

వేటగాని ఉరికైనా వెంటాడే శత్రువుకైనా - కన్నీరే పానమైనా కానరాని గమ్యమైనా (2)
నాపైన లేదుగా ఏ అధికారము - నాకేల భయము నీవేగా కారణము (2)
దేవా నీ కౌగిలిలో నను దాయుము - దేవా నీ కావలిలో నన్నుంచుము (2)
||ఎప్పుడంటే||

అపవాది తంత్రములైనా  అంధకార శక్తులైనా - ఆపదలే అలుముకున్నా ఒంటరినై మిగిలున్నా
నాపైన లేదుగా ఏ అధికారము - నాకేల భయము నీవేగా కారణము (2)
దేవా నీ హస్తముతో నను తప్పించుము - దేవా నీ మార్గము నాకు బోధించుము (2)  
||ఎప్పుడంటే||

---------------------------------------------------------------------------------------
CREDITS : 
--------------------------------------------------------------------------------------