5616) పావురమా ఓ పావురమా పావురమా పరిశుద్ధ పావురమా

** TELUGU LYRICS **

పావురమా ఓ పావురమా 
పావురమా పరిశుద్ధ పావురమా 
బండ సందులలో ఎగిరే పావురమా 
పేటు బీటులు నాశ్రయించు పావురమా
ఓ పావురమా నా పావురమా
ఒకసారి కనిపించవా

నీ రూపులో యున్నది రమణీయము 
నీ చూపులో ఉన్నది దయనీయము 
నీ స్వరములోయున్నది కమనీయము 
నీ ప్రేమలో యున్నది మకరందము

ఆకాశములో ఎగిరే ఓ పావురమా 
నీ రెక్కల నీడలో మమ్ము దాచుమా 
నీ ముఖము మనోహరము కనబడనిమ్ము 
నీ కమ్మని స్వరము నాకు వినబడనిమ్ము

దేశమంతటా పువ్వులు విరబూయగా 
పిట్టల కోలాహలము కాలము రాగా
పదివేల మందిలో ప్రభువా నీవుండగా
గుర్తించి నిన్ను నేను హత్తుకొందును

------------------------------------------------------------------
CREDITS : Music : Suresh flute
Vocals : Tony Prakash & Sis. Priya prakash
------------------------------------------------------------------