5613) సాగిపో సాగిపో క్రైస్తవ్యమా ఎదురులేని దేవుని వంశమా

** TELUGU LYRICS **

సాగిపో సాగిపో క్రైస్తవ్యమా
ఎదురులేని దేవుని వంశమా
 
భుజం భుజం తట్టి
అడుగు అడుగు కలిపి
ఆగక సాగుమా సేవలో సంఘమ

సాగిపో సాగిపో క్రైస్తవ్యమా
ఎదురులేని దేవుని వంశమా

అవమానాలే ఎదురైనా 
కటిక దరిద్రం ఎదురైనా
అవినీతిపరులే రాజ్యమేలిన
నీతి నిమిత్తం హింసిస్తున్న 

ఉప్పిరి ఆగిన ప్రాణం పోయిన (2)
విస్తరిద్దాం వెలుగునిద్దాం
చీకటిని తరిమికొడదాం

సాగిపో సాగిపో 
క్రైస్తవ్యమా
సాగిపో సాగిపో 
ఎదురులేని క్రీస్తు సైన్యమా

ఆత్మల రక్షణే ఆశగా 
సువార్త భారమే శ్వాసగా 
సర్వసత్యమే గమ్యముగా
నిత్యజీవమే లక్ష్యముగా

ఉప్పిరి ఆగిన ప్రాణం పోయిన (2)
విస్తరిద్దాం వెలుగునిద్దాం
చీకటిని తరిమికొడదాం

సాగిపో సాగిపో 
క్రైస్తవ్యమా
సాగిపో సాగిపో 
ఎదురులేని క్రీస్తు సైన్యమా

-------------------------------------------------------
CREDITS : Music: Pastor. Gideon
Lyrics, Tune, Vocals : Stephen Bob
-------------------------------------------------------