** TELUGU LYRICS **
మహిమగల రాజువయ్య యేసయ్యా
మహామహుని శక్తివయ్య యేసయ్యా
వందనాలయ్య యేసు వందనాలయ్య
వందనాలయ్యా యేసు వందనాలయ్యా
||మహిమగల||
మహామహుని శక్తివయ్య యేసయ్యా
వందనాలయ్య యేసు వందనాలయ్య
వందనాలయ్యా యేసు వందనాలయ్యా
||మహిమగల||
భూమి మీద పరిమాణపు కొలవేసిన దేవుడవు వందనాలయ్య
చీకటికి వెలుగునకు సరిహద్దులు గీసినావు వందనాలయ్య
(నా) జీవితమును ఏడిపించు శ్రమలన్నిటికీ
హద్దులేసి సమాధానం పంపినావయ్య
||వందనాలయ్య||
సమానమని ఇతనితో నిన్నెవరికి పోల్చలేము వందనాలయ్య
శబ్దమై వాక్యముగా మా మధ్యకు వచ్చినావు వందనాలయ్య
(నేను) పనికిరాని పాత్రనని విసిరివేయక
కుమ్మరివై మరో పాత్ర చేసినావయ్య
||వందనాలయ్య||
విశ్వమునే నీ ఆజ్ఞకు లోబరచిన శూరుడవు వందనాలయ్య
మహా సంద్రమునే పొంగజేయు మకరమునే చంపగలవు వందనాలయ్య
(నాకు) విరోధమై నిలబడిన ఆయుధాలకు
ఓటమనే బహుమానము ఇచ్చినావయ్య
||వందనాలయ్య||
సంకల్పము లేనినాపై సంకల్పము కలిగినావు వందనాలయ్య
పాపమనే ప్రభుత్వమును నీ కృపతో దించినావు వందనాలయ్య
(ఏ) కంటికైన కానరాని మలినము కడిగీ
నీ అభినయ సాధనముగ మార్చినావయ్య
||వందనాలయ్య||
-----------------------------------------------------------
CREDITS : Music, Tune : Daniel John
Lyrics, Vocals : Bro.Prakash Garu
-----------------------------------------------------------