5636) దయాసాగరా నా యేసయ్యా నీదయ లేనిదే జీవించలేనయ్య

** TELUGU LYRICS **

దయాసాగరా నా యేసయ్యా
నీదయ లేనిదే జీవించలేనయ్య
కరుణా సాగరా నా యేసయ్యా
నీ కనికరమే చూపించినావయ్యా
గడచినకాలం నీకృపలో నన్ను కాచితివి
కృతజ్ఞత కలిగి వినయముతో నిన్ను సేవింతును
నారాజువు నాదేవుడవు నాతండ్రివి నీవే
నాధైర్యము నీవే ఆధారము నా సమస్తము 

ఏనాడైనా నను మరువక ఏక్షణమైనా యెడబాయక
ఏ స్థితిలోనూ నను విడువక ఏ కీడు నాదరి చేరక 
కన్నతండ్రిలా కాచినావులే చేతినీడలో దాచినావులే
నారాజువు నాదేవుడవు నాతండ్రివి నీవే
నాధైర్యము ఆధారము నా సమస్తము నీవే

నాముందుగా నీవే నడిచావయ్య నాఅండగ నీవే నిలిచావయ్య
నాఊహకు మించిన కార్యములెన్నో నాపక్షమై నీవే చేసావయ్య 
న్యాయాధిపతివై నీవుండగ అన్యాయమేదైన నాకు జరుగునా
నారాజువు నాదేవుడవు నాతండ్రివి నీవే
నాధైర్యము ఆధారము నా సమస్తము నీవే 

నిరీక్షణతో నేను ఎదురుచూడగ ఫలితమే శూన్యమై వెక్కిరించగ
నిరాశయే నిశీధిలా ఆవరించగ వేదనతో నేను కృంగియుండగా
ప్రవహించెను నీ ప్రేమధారలే తొలగించెను నా దుఃఖచారలే
నారాజువు నాదేవుడవు నాతండ్రివి నీవే
నాధైర్యము ఆధారము నా సమస్తము నీవే

---------------------------------------------------------------
CREDITS : Music : Prashanth penumaka
Lirics, Tune, Vocal : Pastor Mahesh
---------------------------------------------------------------