** TELUGU LYRICS **
కన్నీళ్ల కడలిలోన నా బ్రతుకు ఈదుతుందే
ఏ రేయి జామైనను నామనసు కుదుటపడదే (2)
మానని గాయాలే మరి రేగుతూ ఉండగా
మనసు ఆశలన్నీ చెదరిపోయెనే (2)
ఏ రేయి జామైనను నామనసు కుదుటపడదే (2)
మానని గాయాలే మరి రేగుతూ ఉండగా
మనసు ఆశలన్నీ చెదరిపోయెనే (2)
నీదు ఉదయకాంతిలో దోషిగానే కనిపించా
ముఖము ఎత్తలేని సిగ్గు కమ్మేనే (2)
శుద్ధిచేయుమా
బలము తగ్గిపోయే ధనము దూరమాయె
శ్రమల అలలలోనే మునిగిపోతినే (2)
లేవనేత్తుమా
పొందుకున్న దర్శనం సత్యవాక్య పోరాటం
నింద దూషణలు ఎన్నో ఎదురాయెనే (2)
శక్తినియ్యుమా
నీదు పాద సన్నిధే నాకు ధైర్యమును యిచ్చే
నీదు సేవ బాటలో పరుగెత్తెదా (2)
బలపరచుమా
నను మరువని నీ వాక్యమే నాతో మాట్లాడుతూ ఉండగా
ఎన్నో శ్రమలు అడ్డొచ్చినా ఆపలేవులే
కన్నీళ్ల కడలిలోన నా బ్రతుకు చేయు నాట్యం
ఏ రేయి జామైనను నా మనసు పాడు నిత్యం
నను మరువని నీ వాక్యమే నాతో మాట్లాడుతూ ఉండగా
ఎన్నో శ్రమలు అడ్డొచ్చినా ఆపలేవులే
కన్నీళ్ల కడలిలోన నా బ్రతుకు చేయు నాట్యం
ఏ రేయి జామైనను నా మనసు పాడు నిత్యం
----------------------------------------------------------------
CREDITS : Music : Sudhakar Rella
Lyrics Tune, Vocal : Dr Visranth Christian
----------------------------------------------------------------