** TELUGU LYRICS **
దేహానికి దీపం కన్ను
కడవరకు నడుపును నిన్ను
లోకమున ఉన్నది అంతా నేత్రాశయే
చూపుల చెరలో బంధించే మాయాలోకమే
చూస్తున్న దృశ్యమే హృదయమందు చిత్రమై గర్భం దాల్చి కంటుంది పాపమే..
కమ్ముకున్న చీకటే మనోనేత్రమే శూన్యమై తనువునే చెరిపి చేస్తుంది మలినమే..
నీ కన్ను చెడినదైతే నీ దేహమంత చీకటిమయము
నీ కన్ను తేటగుంటే నీ జీవితమే వెలుగుమయం

||దేహానికి||
చూపులోనే తడబడి నేత్రాశకే లోబడి ఆదియందున ఆదిదంపతులు చేసెనే పాపమే
శరీరాశకే లోబడి కామచేష్టకే త్వరపడి నరహత్య చేసి దావీదు జరిగించెనే నేరమే
ఆశించిన నేత్రమే చేస్తోంది బ్రతుకునే ఛిద్రమే
చూపులోన వ్యభిచారమే తుది ఫలితమే నిత్యనాశనమే
దొర్లుతున్న పొరపాటులే మనలేని అలవాట్లుగా మార్చివేయును మలినపు నేత్రమే
ఆకర్షణ వలలెన్నున్నా చిక్కుకొనని యోసేపులా సుగుణాలతోనే సాగించు పయనమే

||నీ కన్ను||
పాపుల మధ్య జీవనం పాపమే చేయని నయనం మానవాళికి ఆదర్శమే క్రీస్తుని జీవితం
దుష్టుడేసిన బాణమే ఛేదించే ప్రభు నేత్రమే రక్తమోడ్చిన పోరాటమే నరులకు మోక్షమే
తండ్రి మాటనే మీరక తన దేహాన్ని ప్రేమింపక లోక మహిమనే కోరక..తన ప్రాణాన్ని అర్పించెగా
లోకమంతా చూపినా శిరము వంచని క్రీస్తులా లోకాశలపై సాధించు విజయమే
వ్యర్ధమైనవి చూడక నేత్రాశ దరిచేరక..ప్రభుని బాటలో సాగించు పయనమే

-------------------------------------------------------------------------------------
CREDITS : Lyrics : M Manikanta
Tune, Music & Vocals : Gideon Katta & J V Sudhanshu
------------------------------------------------------------------------------------