5603) ఏకాంతస్థలము కోరుము దేవుని ప్రార్ధింప

** TELUGU LYRICS **

ఏకాంతస్థలము కోరుము - దేవుని ప్రార్ధింప 
ఏకాంత స్థలము చేరుము ఏకాంత స్థలము చేరి 
మోకాళ్ళ మీదవుండి లోకాశలను మదికి రాకుండ చూచుకొనుము 
||ఏకాంత||

ఊహలోని పాపములను - ఒప్పుకొనుము తండ్రి యెదుట  
దేహము లోకలకవియె - దిగును నిన్ను బాధ పెట్టును
||ఏకాంత||

మాటలందలి పాపములను - మన్నించుమని వేడుకొనుము  
ఆటపాటలందు మాట - లాడుటయు నేరంబులగును
||ఏకాంత||

పాపక్రియలు అతి దుఃఖముతో - ప్రభుని యెదుట ఒప్పుకొనుము
పాపము మరల చేయనట్టి - ప్రయత్నంబుల్‌ చేయవలెను
||ఏకాంత||

నిన్ను మరల సిలువవేసి - యున్న పాప జీవినయ్యో
నన్ను క్షమియించుమని యన్న - నరులు మారువారు
||ఏకాంత||

చెడుగుమాని మంచి పనులు - చేయకున్న పాపమగును
పడియు లేవకున్న గొప్ప - పాపమగును పాపమగును
||ఏకాంత||

దేవా! నాకు కనబడుమన్న - దేవ దర్శనమగును నీకు
పావనంబగు రూపము చూచి - బహుగా సంతోషించగలవు
||ఏకాంత||

దేవా! మాటలాడుమన్న - దేవ వాక్కు వినబడు నీకు
నీవు అడిగిన ప్రశ్నలకెల్ల - నిజము తెలియనగును నీకు
||ఏకాంత||

ఎప్పుడు చెడుగు నీలోనికి - ఎగిరి వచ్చునో అప్పుడే
అప్పుడే నరక మార్గమందు - అడుగు బ్టెిన వాడవగుదువు
||ఏకాంత||

కష్టాల మేఘముల వెనుక - కలడు నీతి సూర్యుడు క్రీస్తు
దృష్టించు చున్నాడు నిన్ను - దిగులుపడకు దిగులుపడకు
||ఏకాంత||

నరలోక పాపాలు చూడు - నరకమునకు నిను దిగలాగు
పరలోకము వైపు చూడు - పైకి నిన్ను ఎత్తుచుండు
||ఏకాంత||

** ENGLISH LYRICS **

Ekaanthasthalamu Korumu - Dhevuni Prardhimpa 
Ekaantha Sthalamu Chaerumu Ekaantha Sthalamu Chaeri 
Mookaalla Meedhavundi Loakaashalanu Madhiki Raakunda Choochukonumu 
||Ekaantha||

Oohaloani Paapamulanu - Oppukonumu Thandri Yedhuta  
Dhea-Hamu Loakalakaviyae - Dhigunu Ninnu Baadha Pettunu
||Ekaantha||

Maatalandhali Paapamulanu - Manninchumani Vaedhukonumu  
Aatapaatalandhu Maata - Laadutayu Naerambulagunu
||Ekaantha||

Paapakriyalu Athi Duhkhamutho - Prabhuni Yedhuta Oppukonumu
Paapamu Marala Chaeyanatti - Prayathnambul Chaeyavalenu
||Ekaantha||

Ninnu Marala Siluvavaesi - Yunna Paapa Jeevinayyo
Nannu Kshamiyinchumani Yanna - Narulu Maaruvaaru
||Ekaantha||

Chedugumaani Manchi Panulu - Chaeyakunna Paapamagunu
Padiyu Laevakunna Goppa - Paapamagunu Paapamagunu
||Ekaantha||

Dhaevaa! Naaku Kanabadumanna - Dheva Dharshanamagunu Neeku
Paavanambagu Roopamu Choochi - Bahugaa Santhoashinchagalavu
||Ekaantha||

Dhaevaa! Maatalaadumanna - Dheva Vaakku Vinabadu Neeku
Neevu Adigina Prashnalakella - Nijamu Theliyanagunu Neeku
||Ekaantha||

Eppudu Chedugu Neeloiniki - Egiri Vacchuno Appudae
Appudae Naraka Maargamandhu - Adugu Butaina Vaadavaguduvu
||Ekaantha||

Kashtaala Maeghamula Venuka - Kaladu Neethi Sooryudu Kreesthu
Drushtinchu Chunnaadu Ninnu - Dhigulupadaku Dhigulupadaku
||Ekaantha||

Naraloaka Paapaalu Choodu - Narakamunaku Ninu Digalaagu
Paraloakamu Vaipu Choodu - Paiki Ninnu Etthuchundu
||Ekaantha||

------------------------------------------------------------------------------------------
CREDITS : Lyrics, Tune : Devadas Mungamuri
Vocals & Music : Rev. Dr. P. Sajeeva Rao & Jonah Samuel
------------------------------------------------------------------------------------------

Post a Comment

Do leave your valuable comments

Previous Post Next Post