5601) తప్పిపోయిన గొర్రెను నేను నీ దరికి చేర్చుకో యేసయ్య

** TELUGU LYRICS **

తప్పిపోయిన గొర్రెను నేను
నీ దరికి చేర్చుకో యేసయ్య (2)
యజమానుడా నా యజమానుడా
నీవు తప్ప నాకు ఎవరూలేరయ్యా (2)

నిన్ను చేరే మార్గములో నేనుండగా
ముల్లె నా కాళ్లకు అడ్డుగా ఉన్నది (2)
నా దారిలో వెలుగువై
నా చెంతకు నీవు చేరువై
నా దరికి నీవు రావా నా యేసయ్య (2)

అందరు ఉన్నను ఒంటరినైతిని
చెంతనేవున్నను నీకు దూరముగుంటిని (2)
నీతోనే నేను ఉండాలని
నీతోనే నేను నడవాలని
ఆశతో ఉన్నాను యేసయ్య (2)

--------------------------------------------------------------------------
CREDITS : Lyrics, Tune, Music : Shyam Joseph 
Vocals : Paul Emmanuel, Shyam Joseph
--------------------------------------------------------------------------