5539) యేసుని జననము బహు పూజ్యనీయము

** TELUGU LYRICS **

యేసుని జననము బహు పూజ్యనీయము
ప్రజలందరికీ ఇది శుభవార్త మానము 
గొల్లలకు తెలిపినే దూత సందేశము
జ్ఞానులకు చూపెను ఆ తార గమ్యము 
పుట్టనే యేసునాడు బాలుడై 
తెచ్చేనే నిత్యజీవం మన రక్షణకై 
హోసన్నా హోసన్న నిన్నే పాడి స్తుతించెదం 
హోసన్నా హోసన్న  నీలోనే మా ఆనందం 

చెమ్మగిల్లిన మా కళ్ళను 
చితికిపోయిన మా బ్రతుకులను 
మార్చెనుగా నీ జననము నింపెనులే ఆనందము 
కన్నీరు తుడిచి నాట్యముగా మార్చి 
కలతలన్నీ తీసివేసిన 
మదిలో చీకటి వెలుగుగా చేసి 
నిత్య సంతోషం మాకిచ్చిన 
||హోసన్నా||
 
నీ జనులందరి క్షేమమై నీవు చూపిన మార్గము 
చెదరిపోయిన వారిని మరలా పిలిచే నీ జననము 
పవిత్ర పరచి పరిశుద్ధతనిచ్చి నీ సన్నిధిలో నిలబెట్టిన 
మరణాన్ని గెలిచే ధైర్యాన్ని నింపి నిత్యజీవం మాకిచ్చిన 
||హోసన్నా||

--------------------------------------------------------------------
CREDITS : Music : Pradeep Sagar
Lyrics, Tune, Vocals : K. Ramesh Nehemiah
--------------------------------------------------------------------