5428) యేసు రాజు పుట్టెను ఎంతో ఆనందం

** TELUGU LYRICS **

యేసు రాజు పుట్టెను ఎంతో ఆనందం 
రక్షించబడిన మనకు ఎంతో సంబరం 
ఆదియందు వాక్యము మెస్సయ్యా ఆయెను 
ప్రవచనాలు సంపూర్ణం ఎంతో ఆశ్చర్యం

పరలోక తండ్రి చేసిన ప్రణాళిక 
క్రిస్మస్సు పండుగాయెను 

ఆకాశములో ఒక వింతాయెను
వింతైన పెద్ద చుక్క వెలసి మెరిసెను
వెదికే జ్ఞానులకు అది కనిపించెను 
యేసయ్య చోటుకు తీసుకొచ్చెను 

పరలోక తండ్రి చేసిన ప్రణాళిక 
క్రిస్మస్సు పండుగాయెను 

శరీరధారియై మనలో ఒకనిగా 
మహిమంతా విడచి వచ్చినా
నీ మహిమతో నిండిన కృపతో
మాతోనే జీవించావా

పరలోక తండ్రి చేసిన ప్రణాళిక 
క్రిస్మస్సు పండుగాయెను

 పరలోకమును ఈ లోకముకు 
 నీ రాజ్యముగా తెచ్చావా
 చీకటి నుండి వెలుగులోనికి 
 మా అందరిని మార్చావా

పరలోక తండ్రి చేసిన ప్రణాళిక 
క్రిస్మస్సు పండుగాయెను

పరలోక తండ్రి చేసిన ప్రణాళిక 
క్రిస్మస్సు పండుగాయెను

------------------------------------------------------
CREDITS : Tabernaclers Ministries
Ps. George Sambathini
------------------------------------------------------