** TELUGU LYRICS **
మనలను రక్షింపను - యేసు - లోకాన ఉదయించెను
మన పాపాలు తొలగింపను - భువిలో - నరుడై జనియించెను
సర్వజనులను రక్షింపను - శ్రీ యేసుండు దిగివచ్చెను
ఆహా ఆనందమే - మహా సంతోషమే - యేసయ్య మనకొరకు పుట్టాడని
రక్షణ తెచ్చెను - స్వస్థతనిచ్చెనె - చూసావ యేసయ్యను మరి
విన్నావ సువార్తను

దివిలోన మెరిసెను ఎన్నోతారలు
మార్గము చూపెనొక తార
జ్ఞానులు అనుసరించారుగా - అది మార్గము చూపించెనుగా
నీలోన వెలగాలి ఒకతార - మారాలి ఈ వేళ నీ బాట
ఇదే క్రిస్మస్ ఆనందము - పరలోక సంతోషము
చీకటిలో ఉన్న గొల్లలను - దూత నింపెను వెలుగుతో వారిని
వెలుగును అనుసారించారుగా - వారు - క్రీస్తును కనుగొన్నారుగా
వెలుగుతో నిండాల నీ బ్రతుకే - యేసయ్య దిగివచ్చెనీ భువికే
ఇదే క్రిస్మస్ ఆనందము - పరలోక సంతోషము
-------------------------------------------------------
CREDITS : Music : Enosh pakerla
Lyrics, Tune, Vocals : Finnu pakerla
-------------------------------------------------------