5529) వినరా బాబు అబ్బ ఏందిరా డాబు

** TELUGU LYRICS **

వినరా బాబు అబ్బ ఏందిరా డాబు 
ఆగర బాబు పరికించరబాబు 
(ఆ)దేవుడు లేని పండగ కాస్త దండగ అయిపోదా(2) 
నీ పేరుకు మాత్రం చేసేదంతా క్రిస్మస్ అవుద్దా
||వినరా||

వేలకువేలు డబ్బులు పోసి 
వేలకువేలు డబ్బులు పోసి బట్టలు కొంటావు 
పది వేలకువేలు డబ్బులు పోసి బట్టలు కొంటావు 
నీ ఆత్మకు మాత్రం నూలు పోగు లేదని మరిచావు(2) 
ఆ విషయం కాస్త పక్కన పెట్టి పండుగ చేసావు
||వినరా||

డాన్సులు అంటూ కొరియోలంటూ  
డాన్సులు అంటూ కొరియో అంటూ నాట్యం చేసావు 
గొప్ప డాన్సులు అంటూ కొరియో అంటూ నాట్యం చేసావు 
నీ ఆత్మకు మాత్రం కట్టిన కట్లు అట్టెవదిలావు (2) 
నీ పాపపు తాళ్ళు వేసి ఆత్మను బంధిచేసావు
||వినరా||

కేకులు అంటూ ఫలహారాలంటూ 
బిర్యానితో విందులు చేస్తూ చాలా మరిచావు 
బిర్యానితో విందులు చేస్తూ చాలా మరిచావు 
నీ ఆత్మకు మాత్రం దేవుని వాక్యం దూరం చేసావు (2) 
వాక్యహారం పూర్తిగ మాని చెతికెల పడ్డావు 
||వినరా||

బోధకులంటూ గొప్ప సేవకులంటూ 
బోధకులంటూ గొప్ప సేవకులంటూ ఆహ్వానించావు 
బోధకులంటూ గొప్ప సేవకులంటూ ఆహ్వానించావు 
వాక్యం చెప్పే సమయం మాత్రం తక్కువ ఇచ్చావు (2) 
అద్భుతమైన వాక్యం అంటూ కవరించేసావు
||వినరా||

చెబుతూ పోతే ఇక చెబుతూ పోతే చెబుతూ పోతే 
చాలా ఉంది సరి పెడదా మింకా 
చూస్తు ఉంటే చాలా ఉంది తెమలదులే ఇంకా 
దేవుని వాక్యం చెప్పేదేంటో గమనిస్తూ ఉంటే 
ఆ దేవుని వాక్యం చెప్పేదేంటో గ్రహియిస్తూ ఉంటే
ప్రతి రోజు పండుగ రాదా దేవుడు అన్నట్లే
||వినరా||

---------------------------------------------------------------------------------------
CREDITS : Lyrics, Tune, Music & Vocals : Jonah Samuel
--------------------------------------------------------------------------------------