5528) రాజులకే రారాజు పశువుల పాకలోన

** TELUGU LYRICS **

రాజులకే రారాజు పశువుల పాకలోన
శిశువై జన్మించె వాహ్వారే
దేవాది దేవుడు  కన్య మేరీ గర్భమందు
శిశువై జన్మించె వాహ్వారే
జనులారా ముదమారా రక్షకుని చూడ రారండి
జనులారా ముదమారా రక్షకుని వేడ రారండి
Happy Happy Christmas Merry Merry Christmas
సంబరాల క్రిస్మస్ ఇది సంతోషాల క్రిస్మస్

ఆదిసంభూతుడు అదృశ్య దైవం
పరమపావనాత్ముడు పరలోక వాసి
ఏదేను అధికారి ఆదాము శాపహారి
పరము వీడి నేడు మనుజుడాయే చూడు
నింగిలో తార దారి చూపెను
(మన) చీకటి బ్రతుకులో వెలుగు కలిగెను

యెష్షయి మొద్దున మెస్సియ్యా చిగురు
ప్రవచనాలన్నీ నెరవేరె నేడు
గొల్లలు చూచి ముందు ఉల్లాసమొందినారు
చుక్కని చూచి జ్ఞానుల్ కానుక లిచ్చినారు
పాప శాపములు తొలగిపోయెను
ఇహ పరలోకములో సంభరమాయెను

----------------------------------------------------------------
CREDITS : Music : Suresh Punuru
Lyrics, Tune, Vocals : Samuel Varaprasad
----------------------------------------------------------------