5527) భాగ్యము ఎంతో భాగ్యము రక్షణ ఇకపై రక్షణ

** TELUGU LYRICS **

భాగ్యము ఎంతో భాగ్యము రక్షణ ఇకపై రక్షణ                                                     
లోకాన్ని రక్షింప పుట్టినాడయ్యా
నిత్య జీవపు మార్గము చూపినాడమ్మా (2)

హైలో హైలో హైలెస్సా ఎంతో భాగ్యము 
హైలో హైలో హైలెస్సా ఇది రక్షణ భాగ్యము (2)

అందాల బాలుడు 
పశువుల పాకలో
పరిశుద్ధునిగా జన్మించేగా (2)
తూర్పు దేశపు జ్ఞానులు గొర్రెల కాపరులు 
నా యేసును చూసి మురిసిపోయేనే (2)
అతికాంక్షనీయుడు అతి సుందరుడు 
నా యేసయ్యనే ఆరాధించుచూ ఆనందించేనే
||హైలో||

ఇమ్మానుయేలుగా 
మాకు నీవే తోడుగా 
రక్షణ ఇచ్చిన దైవము నీవేగా (2)
ఆత్మతో సత్యముతో  ఆరాధించుచూ 
నిత్యము నీసన్నిధిలో నిలచియుందుము (2)
నీతి సూర్యుడు నిత్య జీవమునిచ్చెను 
నిత్యమైన వెలుగులోనికి నన్ను నడుపును
||హైలో||

--------------------------------------------------------------------------------------------------
CREDITS : Lyrics & Tune : Ravindra Polakam
Vocals & Music : Sis.Lillian Christopher, Amulya & Billy Graham
--------------------------------------------------------------------------------------------------