5526) జన్మించెను యేసు ఈ భువిలో ఉదయించెను మన అందరిలో

** TELUGU LYRICS **

జన్మించెను యేసు ఈ భువిలో 
ఉదయించెను మన అందరిలో 

ఆనందముతో సంతోషముతో మన తండ్రిని ఆరాధిద్దాం 
ఉల్లాసముతో  ఉత్సాహముతో దైవ సన్నిధిని చేరెదము
ఆనందముతో సంతోషముతో మన రక్షకుని ఆరాధిద్దాం 
ఉల్లాసముతో ఉత్సాహముతో శుభవార్తను చాటెదము 

లోక రక్షకుడు యేసు 
ప్రేమను పంచె పావనాత్ముడు
మహిమస్వరూపియై తానే శరీరదారియై దిగివచ్చినాడు 
నశించువారిని వెదకి రక్షించి
నీతి మార్గములో నడిపించేవాడు 
విశ్వశించిన జనులందరికి నిత్య జీవము దయచేయువాడు 

దీనత్వము కలిగి యేసు 
పరిశుద్ధతతో భువికి ఏతెంచెను 
మన పాపము కొరకై తానే 
కలువరి సిలువలో బలియాయెను 
పాప చీకటిని తొలగించి 
వెలుగునిచ్చిన నీతిసూర్యుడు 

----------------------------------------------------------------------------
CREDITS : Music & Vocals : Sax Bunker & Sunny
Lyrics, Tune, Vocals : Shakeena Bunker
----------------------------------------------------------------------------