** TELUGU LYRICS **
ఇదిగో ప్రజలందరికీ శుభవార్త
రక్షకుడేసుని జనన వార్త (2)
మది శాంతి సంతోషం
హృది అక్షయుని సునాదము (2)
మది ఆనందమే మహదానందమే (2)
||ఇదిగో||
దావీదు పట్టణమందు దివిజుడు శ్రీ యేసుడు (2)
కన్య మరియ గర్భమందు
దీనుడై ఇల వెలిసెను (2)
||మది శాంతి||
పరలోక మహిమ వీడి
నరుని రూపము దాల్చి (2)
ధరణి పాపములను బాప
ధన్యుడై ఇల వెలేసెను (2)
||మది శాంతి||
----------------------------------------------------------------------------------------------
CREDITS : Vocals : Sis Jessy Paul, Ps Divya David
Lyrics, Tune & Music : Bishop Pammi Daniel & David Selvam
----------------------------------------------------------------------------------------------