** TELUGU LYRICS **
ఆ చల్లని రేయిలో
ఆ చల్లని రేయిలో - సరాగాల నిశి రాత్రిలో
సర్వోన్నతుడు ఆ యేసు ప్రభువు
దివి నుండి భువి చేరు వేళ
ఆ చల్లని రేయిలో - సరాగాల నిశి రాత్రిలో
సర్వోన్నతుడు ఆ యేసు ప్రభువు
దివి నుండి భువి చేరు వేళ
అపురూపమైన ఆ దివ్య రూపం
అలరారు ఇలలోన పరలోక దైవం (2)
పవళించె ఒడిలోన పసిప్రాయుడై
పశుసాలలోన కడు ధీనుడై
స్థుతియించ నా భాగ్యము
స్మరియించ సౌభాగ్యము
||ఆ చల్లని||
దూతాళి పాడింది పరలోక సారం
మనుజాళి చేసింది ఇల కీర్తి స్తోత్రం (2)
నను వీడలేనంది పరలోక నేస్తం
నను చేర తపియించే ఆ యేసు దైవం
స్తుతియించి నే పాడనా
స్మరియించి కొనియాడనా
||ఆ చల్లని||
-----------------------------------------------------------------
CREDITS : Music : Rajkumar
Lyrics, Tunes, Vocals : Kishore Ayinavilli
-----------------------------------------------------------------