5523) మన ప్రాణ రక్షకుడు క్రీస్తేసు దేవుడు

** TELUGU LYRICS **

మన ప్రాణ రక్షకుడు - క్రీస్తేసు దేవుడు 
మనలన్ - విమోచింపను - రక్షకుడై ఉదయించెను
సర్వోన్నత స్థలములలో - మహిమయు దేవునికే
ప్రియమైన మనకిలలో - శాంతి సమాధానమే (2)

పాపమున్ - శాపమున్ తొలగించ ఏతెంచెను
నమ్మిన వారిని నిత్యము జీవింపజేయును
ఇమ్మానుయేలను నామము - నిత్యము మన తోడుగా!  
యేసు నామమే రక్షణ - స్వస్థత - విడుదల (2)

చీకటైన బ్రతుకులకు - తారగా వెలసెను
చెరలోనున్న వారికి - విడుదలనివ్వ దరిచేరేను
నిజమైన వెలుగు ఆయనే - వెలిగించె లోకమును!
యేసు నామమే వెలుగును - రక్షణ - జీవము (2)

వాక్యమే శరీరమై - మన మధ్య నివసించెను
ఆత్మయు శక్తిగా - మనలో వసియింప వచ్చెను
చేర్చుకో ప్రభు యేసుని - హృదయములో నేడు! 
చెంత చేరిన వారిని - విడువని దేవుడు (2)

---------------------------------------------------------------------------------------
CREDITS : Lyrics, Tune : Suresh Janipalli
Vocals & Music : Sister Lillian Christopher & Bro. K Elia 
--------------------------------------------------------------------------------------