5531) వెలిగింది ఈ లోకము మురిసింది నా హృదయము

** TELUGU LYRICS **

వెలిగింది ఈ లోకము 
మురిసింది నా హృదయము 
మదినిండా సంతోషము 
యేసయ్య నీ జన్మము 
సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ 
తనకిష్టులైన మనుషులకు సమాధానము 
Happy happy Christmas 
Merry Merry Christmas 

మనుష్య కుమారునిగా అరుదెంచి 
మనుజావతారునిగా  దిగివచ్చి 
పాపము శాపమును తొలగించి 
ప్రతి మనిషి హృదయమును వెలిగించి 
పరమును వీడి వరముగా వచ్చిన 
నా యేసయ్య
||యేసయ్య||

పాపపు లోకములో పయనించి 
పాపము లేకుండా జీవించి 
చీకటి రాజ్యాన్ని కూల్చేసీ 
వెలుగు రాజ్యాన్ని స్థాపించి 
చనిపోయిన మము లేపగ వచ్చిన 
మా యేసయ్య
||యేసయ్య||

తండ్రి తనయునిగా తలవంచి
మనుషుల పాపముకై మరణించి 
చీకటి గుండెలను చీల్చేసి 
కాంతి రేఖలను ప్రసరింపజేసి 
పాపుల కొరకు ప్రాణం పెట్టిన 
మా యేసయ్య
||యేసయ్య||

** ENGLISH LYRICS **

----------------------------------------------------------------------------------------------
CREDITS : Lyrics, Tune : Pas.Moses 
Music & Vocals : Dr.J K Christopher & Sis Lillian Christopher
----------------------------------------------------------------------------------------------