5532) బాల యేసు పుట్టాడురో ఈ జగమంతా పండగేరో

** TELUGU LYRICS **

బాల యేసు పుట్టాడురో
ఈ జగమంతా పండగేరో
బాల యేసు వచ్చాడురో
మన బతుకుల్లో వెలుగు నింపేరో (2)
పాపులను రక్షించుటకు - ఈ లోకానికొచ్చాడురో (2)
ఆహా ఆనందం ఎంతో సంతోషం
ఈ సుదినం మనకు సంబరం (2)

ఆ బెత్లెహేములో ఆ పశుల పాకలో
బాలుడు యేసు ఉదయించేనే
తారన్ చూసి తూర్పు జ్ఞానులు
యేసుని చూడ వెంబడించిరే (2)
బంగారు సాంబ్రాణి బోళములిచ్చి
ఆయన సన్నిధిన సాగిలపడిరే (2) 
||ఆహా ఆనందం||

మన బతుకుల్లో పాపము నుండి
మనలను విడిపింపగా జన్మించేనే
కీడును పోగొట్టి ఆశీర్వదించి
తన స్వాస్థ్యముగా మనల్ మార్చేనే (2)
పరిశుద్ధుడు యేసు ఇమ్మనుయేలుగా
మన మధ్యన ఇలా సంచరించునే (2) 
||ఆహా ఆనందం|| 

----------------------------------------------
CREDITS : 
----------------------------------------------