5502) యూదయ దేశమందు బెత్లెహేము గ్రామమందు

** TELUGU LYRICS **

యూదయ దేశమందు బెత్లెహేము గ్రామమందు 
యేసయ్య పుట్టినాడు కన్య మరియ గర్భమందు 
రాజుల రాజు ప్రభువుల ప్రభువు
పాపుల బ్రోవగ వెలసిన రక్షకుడు (2)
దైవమే నరుని రూపు దాల్చిన ఈ శుభ దినం
సర్వలోకానికి నేడే శుభోదయం

Happy happy happy happy 
Happy Christmas 
Merry merry merry merry 
Merry Christmas (2)
||యూదయ||

గొర్రెల కాపరులకు దూత తెలిపే శుభవార్త
ధన్యత పొందింది వారి దీన బ్రతుకంతా 
తార నడుపగా వొచ్చిరి ఆ జ్ఞాన త్రయమంతా 
బంగారు సాంబ్రాణి బోళములను అర్పింప (2)
దీనుడై పేద ఇంట జన్మించెగా (2)
అందరి పాపములను పరిహరింపగా (2)

ఆశ్చర్య కరుడు ఆలోచన కర్త 
బలవంతుడైన ప్రభువు నిత్యుడగు తండ్రి 
సమాధాన కర్తయగు సమస్తమునకధిపతి
నిన్ను నన్ను బ్రతికించే పరలోక వారధి (2)
శిశువుగా తల్లి వొడిని పవళించెగా (2)
మనకు విశ్రాంతిని అనుగ్రహింపగా (2)

---------------------------------------------------------
CREDITS : Lyrics, Vocals by: Chanda
Music: Jk Christopher 
---------------------------------------------------------