5499) తరములు యుగములు గడిచినా చెరగని కథ ఇది తెలుసునా

** TELUGU LYRICS **

తరములు యుగములు గడిచినా చెరగని కథ ఇది తెలుసునా
తరగని మహిమల గురుతులే మెదులును కద ప్రతి మనసునా
శాప ధూపము కమ్మిన లోకమునే రక్షింపగా
పాప పంకిలమంటిన పుడమిని కడుగంగా
వెలసినదీ ఆ దైవం
జనులకదే శుభ తరుణం
||తరములు||

ఎపుడు కననిది ఎవరు విననిది జగతి మురిసిన జన్మది
మమత కురిసిన సమత విరిసిన అమిత అరుదగు క్షణమది
పశువుల పాకలొ ప్రేమ జనియించెనే ఓ
అలసిన అవనికి ఆశ చిగురించెనే
నింగిన వింత తార మెరిసే నేలన కాంతి రేఖ వెలిగే
నవ్వులు పువ్వులల్లె పూసే బతుకున నందనాలు విరిసే   
||వెలసినదీ||

మరపురానిది మరువలేనిది అమర చరితము యేసుది
మాటకందని మనసు నిండని మహిమ రూపము క్రీస్తుది
ఇలలో దైవం మనుజుడై మెలిగెనే ఓ
మమతల మధువులు పుడమిపై చిలికెనే
తనతో సంతసాలు వచ్చే తనకై సంబరాలు జరిగే
జనముల జీవితాలు మారే జన్మలు ధన్యమై మిగిలే
||వెలసినదీ||

** TELUGU LYRICS **

Tharamulu Yugamulu Gadichina - Cheragani Katha Idhi Thelusuna
Tharagani Mahimala Guruthule - Medulunu Kadha Prathi Manasuna
Shaapa Dhoopamu Kammina - Lokamune Rakshimpaga
Paapa Pankilamantina - Pudamini Kadugnaga
Velasinadee - Aa Daivam
Janulakadhe - Shubha Tharunam
||Tharamulu||

Yepudu Kananidhi-Yevaru Vinanidhi - Jagathi Murisina Janmadhi
Mamatha Kurisina - Samatha Virisina - Amitha Arudagu Kshanamadhi
Pasuvula Paakalo Prema Janiyinchene - O O
Alasina Avaniki Aasa Chigurinchene - O Oo
Ningina Vintha Thaara Merise - Nelana Kaanthi Rekha Velige
Navvulu Puvvulalle Poose - Bathukuna Nandanaalu Virise
||Velasinadee||


Marapu Raanidhi - Maruvalenidhi-Amara Charithamu Yesudhi
Maatakandani - Manasu Nindani - Mahima Roopamu Kreesthudhi
Ilalo Daivam Manujudai Meligene - O O
Mamthala Madhuvulu Pudamipai Chilikene - O O
Thanatho Santhasaalu Vache - Thanakai Sambaraalu Jarige
Janamula Jeevithaalu Maare - Janmalu Dhanyamai Migile
||Velasinadee||

-----------------------------------------------------------------------
CREDITS : Lyricist : Sameera Nelapudi
Music & Vocals : Jonah Samuel & Nissy John
-----------------------------------------------------------------------