5498) దివినుండి భువికివచ్చినావు నరరూపిగా జన్మించినావు

** TELUGU LYRICS **

దివినుండి భువికివచ్చినావు
నరరూపిగా జన్మించినావు
లోకానికే వెలుగునిచ్చినావు
పాపాంధకారమంత తీసివేసినావు
ఆనందం ఆనందం ఆనందం యేసయ్యలో
ఆనందం ఆనందం ఆనందం ఈ క్రిస్మస్ ఆనందం

ఇమ్మానుయేలుగా యేసు అను పేరున
మాకు తోడుగా నిలిచినావు
నీ రక్షణ మార్గం చూపినావు
ఆశ్చర్య కరుడవు నీవు
ఆలోచనకర్తవు నీవు
నిత్యుడగు తండ్రివి నీవు
సమాధాన కర్తవు నీవు
ఆనందం ఆనందం ఆనందం యేసయ్యలో
ఆనందం ఆనందం ఆనందం ఈ క్రిస్మస్ ఆనందం

ధీనులను కావగా ధన్యంబు చేయగా
పరలోక భాగ్యమిచ్చుటకు
నీ కుడి పార్సమున నిలుపుటకు
కరుణగల దేవుడవు నీవు
కృపాసత్య సంపూర్ణుడవు నీవు
వాత్సల్యపూర్ణుడవు నీవు
ఆదియు అంతము నీవు
ఆనందం ఆనందం ఆనందం యేసయ్యలో
ఆనందం ఆనందం ఆనందం ఈ క్రిస్మస్ ఆనందం

----------------------------------------------------------
CREDITS : Music: Vinay Kumar B
Lyrics, Tune, Vocal : Pastor Vijayanna
----------------------------------------------------------