5500) క్రీస్తు నేడు జనియించినాడు పరలోకం మనకు ఇచ్చుట కొరకు

** TELUGU LYRICS **

క్రీస్తు నేడు జనియించినాడు
పరలోకం మనకు ఇచ్చుట కొరకు (2)
దివిలోని దూతలంతా సంబరాలు చేయంగా
భువిలోని గొల్లలంతా నాట్యమాడి పాడంగా (2)
తనన తానన తనానానా (4)    
||క్రీస్తు నేడు||

ఎన్నో రోజుల ఎదురుచూపంత కళ్ళ ముందుకే కనబడి పోగా (2)
పాప శాపాలు బాపే నాధుడు యేసు (2)
మనకోసం వచ్చేనని గంతులేసి ఆడంగ (2)  
||తనన||

నిరీక్షణ లేని జీవితానికి సర్వోన్నతుడే సమాధానము రా (2)
నిర్బాయులమై నీతిగా జీవించుట కొరకు (2)
ఈ రక్షనిచ్చాడని సంబరాలు చేద్దామా (2)  
||తనన||

-----------------------------------------------------------
CREDITS : Music : Nani Mohan Karra
Lyric, Tune, Vocals : Bro. Anil Kumar
Youtube Link : 👉 Click Here
-----------------------------------------------------------