5535) తార వెలసే చూడు ఆ గగనమందు నేడు

** TELUGU LYRICS **

తార వెలసే చూడు ఆ గగనమందు నేడు
భూలోకమంత మురిసే రక్షకుడు వెలసే ననుచు (2)
కన్నులార చూడరండి 
కన్నె మరియ తనయుడండి 
కరుణించగ వచ్చెనండి 
కమనీయ రూపుడండి 
నీతి మంతుడు సత్య వర్తనుడు 
ఉదయించాడు జీవజలము తానై (2)

హే.. రాజుల రాజు రాజాధిరాజు 
రమ్యమైన దేవుడు
దేవ దేవుడు దేవాది దేవుడు
హల్లెలూయ హల్లెలూయ (2)

దూత తెల్పెను గొల్లలకు శుభవార్త
గంతులు వేయుచు యేసు వైపు సాగిరి (2)
తేజోవాసుని చూసి తన్మయమే చెందిరి
లోకా రక్షకుని పాదాల చెంత చేరిరి
ఆత్మీయతతో ఆనందముతో
బాలుని పొగడుచు పయనమయ్యిరి (2)

హే.. రాజుల రాజు రాజాధిరాజు 
రమ్యమైన దేవుడు
దేవ దేవుడు దేవాది దేవుడు
హల్లెలూయ హల్లెలూయ (2)

జ్ఞానులు చూసిరి తూర్పు దిక్కున ఒక తారను
వెంబాడించిరి అలుపును ఎరుగక వారు (2)
యూదుల రాజును చూసి సాష్టాంగ పడితిరి 
సర్వలోకాధిపతికి కానుకలర్పించిరి
పరమరాజుని ఆరాధించిరి 
పరిశుద్ధాత్మతో సాగిపోయిరి

హే.. రాజుల రాజు రాజాధిరాజు 
రమ్యమైన దేవుడు
దేవ దేవుడు దేవాది దేవుడు
హల్లెలూయ హల్లెలూయ (2)

జగాన పాపులను వెదకి రక్షించుటకు
నరావతారుడై ధరపై అవతరించెను
ప్రవచనాలు నెరవేర కన్య మరియ గర్భమందు 
జన్మించే మన ప్రభువు జనతైకా సుతుడండి 
సర్వోన్నతమైనా స్థలములలో దేవునికి మహిమ కలుగును గాక
భూమి మీద సమాధానము 
జనమంతటికి కలుగును గాక

హే.. రాజుల రాజు రాజాధిరాజు 
రమ్యమైన దేవుడు
దేవ దేవుడు దేవాది దేవుడు
హల్లెలూయ హల్లెలూయ (2)

------------------------------------------------------
CREDITS : Vocals : k. Jessie Priya
Music, Lyrics : Santhosh Kavala
------------------------------------------------------