5534) నింగి నేల నేలే రాజు నిన్ను నన్ను కాచు మహారాజు

** TELUGU LYRICS **

నింగి నేల నేలే రాజు 
నిన్ను నన్ను కాచు మహారాజు 
పుట్టాడంట మనకై ఈరోజు 
ఇక సందడేనంట మనకు ప్రతిరోజు

గుండెల్లో వెలుగు నింపే 
నిజమైన ప్రేమ పంచే 
లోకాలనేలే యేసు పుట్టాడురా
సంభారంగా చిందులేద్దాము రా 
కన్నీటిని తుడిచేస్తాడు రా 
కష్టాలను తొలగిస్తాడు రా
ప్రేమ పంచే మహారాజు రా
పశువుల పాకలో జన్మించే రా.

దిక్కులేని వారి కొరకు 
దైవ తనయుడే పుట్టాడు రా 
వస్తువస్తు మన కోసము 
రక్షణను తీసుకొచ్చాడు రా (2)
దండాలు పెడదామా దండోరా వేద్దామా
దేవాది దేవుడు పుట్టాడని (2)

----------------------------------------------------------
CREDITS : Music : Praveen Gandham
Lyrics, Tune, Vocals : Praveen Gorre
----------------------------------------------------------