5549) సందడాయే యేసయ్య పుట్టాడని పండగొచ్చే మెస్సయ్య పుట్టాడని

** TELUGU LYRICS **

సందడాయే యేసయ్య పుట్టాడని 
పండగొచ్చే మెస్సయ్య పుట్టాడని (2)
ఛలో! ఆడుదాం ఆడుదాం యేసయ్య జన్మదినం
పాడుదాం పాడుదాం కొత్త గీతం 
||సందడాయే||

తార వెలిసేనంట - నేల మురిసేనంట 
దూత పిలిచేనంట - గొల్లలు పలికేనంట (2)
రక్షకుడు యేసయ్యoటా - మన పాపాలను కడిగేనంట
సందడాయే సందడాయే సందడాయే సందడాయే 
||సందడాయే||

మనసులు పొంగేనంట - కానుక తెచ్చారంట
రాజుకు ఇచ్చేనంట - సంతసించ్చెనంట (2)
రారాజు యేసయ్యoటా - మనకొరకే వచ్చాడంట
సందడాయే సందడాయే సందడాయే సందడాయే 
||సందడాయే||

-----------------------------------------------------------------------------
CREDITS : Lyrics, Music, Vocals : Br. Sam Ovens
-----------------------------------------------------------------------------