5550) నాట్యమాడి పాట పాడవో తమ్ముడా యేసు రాజు పుట్టాడని

** TELUGU LYRICS **

నాట్యమాడి పాట పాడవో తమ్ముడా యేసు రాజు పుట్టాడని - 
గంతులేసి ఉల్లసించవో చెల్లెల రక్షణ దొరికిందని (2)
ఆర్భాటంగా ఉత్సాహంగా పాటలు పాడుదాం నీవు నేను కలిసి వెళ్లి క్రీస్తుని చాటుదాం (2)
నాట్యమాడి పాట పాడవో తమ్ముడా ఏసు రాజు పుట్టాడని - 
గంతులేసి ఉల్లసించవో చెల్లెల రక్షణ దొరికిందని

బెత్లెహేములో మరియ గర్భములో బాల యేసు ఉద్భవించినాడు -  
పరలోక దూత సైన్యముతో ఆర్భాటించగా దిగివచ్చిరి (2)
చీకటి గల లోకంలోన వెలుగంట వచ్చేనంట మనము కూడా దూతలతో ఆరాధించెదం (2)
ఆర్భాటంగా ఉత్సాహంగా పాటలు పాడుదాం నీవు నేను కలిసి వెళ్లి క్రీస్తుని చాటుదాం (2)
నాట్యమాడి పాట పాడవో తమ్ముడా ఏసు రాజు పుట్టాడని - 
గంతులేసి ఉల్లసించవో చెల్లెల రక్షణ దొరికిందని

రాజులకు రారాజు పుట్టాడని గొల్లలకు దూత తెలిపే శుభమని - 
వింతైన చుక్క చూచి జ్ఞానులు రక్షకుని పూజింప వచ్చిరి (2)
బంగారము తెచ్చారంట సాంబ్రాణి బోళం ఇచ్చారంట మనము కూడా మన హృదయం అర్పించేదం (2)
ఆర్భాటంగా ఉత్సాహంగా పాటలు పాడుదాం నీవు నేను కలిసి వెళ్లి క్రీస్తుని చాటుదాం (2)
నాట్యమాడి పాట పాడవో తమ్ముడా ఏసు రాజు పుట్టాడని - 
గంతులేసి ఉల్లసించవో చెల్లెల రక్షణ దొరికిందని.

---------------------------------------------------------------------------
CREDITS : Lyrics : Lidiya Paul, Jimmy & Joe
Music & Vocals : Jimmy & Bro. Atchyuth Enosh
---------------------------------------------------------------------------