5448) సంబరమే సంతోషమే ఆనందమే ఆర్భాటమే

** TELUGU LYRICS **

సంబరమే సంతోషమే ఆనందమే ఆర్భాటమే
నా యేసుని జన్మ నాకెంతో పండుగ (2)
దివినేలే మహారాజు ఇలలో జన్మించాడీలోకానికి రక్షణ ఇచ్చుట కొరకు 
సర్వలోకానికి శుభవార్త రారాజు ఇలలో జన్మించాడు 
క్రిస్మస్ ఆనందము మనకు రక్షకుడేసుకు మహిమా
||సంబరమే||

శుభరాత్రి శుభవేళ శుభతార అంబరాన
భువిపైన మోక్షమహిమ తేజరిల్లె (2)
దూతల స్తోత్రనాదములతో అరుణోదయ దర్శనముగా
రక్షకుడు మనకు ఉదయించెను సర్వలోకానికి వెలుగునిచ్చెను 
||సర్వలోకానికి|| ||సంబరమే||

పశువుల తొట్టెలో పవళించె పరమాత్ముడు 
దీనుడయ్యెను దేవదేవుడు (2)
నరుల రక్షణ కొరకూ నరావతారమెత్తెనూ
నా దేవుడే దీనుడై దిగివచ్చి సర్వలోకానికి రక్షణిచ్చెను 
క్రిస్మస్ ఆనందము హల్లెలూయా క్రిస్మస్ ఆర్భాటము హోసన్నా 
క్రిస్మస్ ఆనందము హల్లెలూయా క్రిస్మస్ ఆర్భాటము స్తోత్రములు 
||సంబరమే||

మందల కాపరులు మోదమొంది బాలయేసుని గాంచిరి 
చుక్క నడుప జ్ఞానులొచ్చి కానుకలతో కొలిచి కీర్తించిరి 
రక్షకుడేసు పుట్టెనంటు పూజిస్తూ ప్రభుని కీర్హించిరి 
నరులందరికి శుభవార్త అంటూ రక్షకుని కీర్తించిరి 
||సర్వలోకానికి|| ||సంబరమే||

--------------------------------------------------------------------------------
CREDITS : Music, Tune : Billygraham
Lyrics & Vocals : Pas. T.J Dayaseela & Joshua Gariki
--------------------------------------------------------------------------------