5447) పాపుల కొరకు రక్షకుడు పుట్టడోయమ్మ

** TELUGU LYRICS **

పాపుల కొరకు రక్షకుడు పుట్టడోయమ్మ
మన పాపం శాపం బాపగను వచ్చాడోయమ్మ (2)
లోకలనేలెరాజు దీనునిగా దిగివచ్చాడు
మహిమంతా విడచి నేడు మనకొసం భువికొచ్చాడు
సంబరమే సంబరమే ఊరు వాడ సంబరమే
సంబరమే సంబరమే లోకమంత సంబరమే (2)

అర్ధరాత్రి వేళలో సలిగాలి సప్పిట్లో
దేవదూత దిగివచ్చి శుభవార్త చెప్పెనట (2)
గొల్లలేమో బేగెల్లి రక్షకుని చూసిరట
విన్నవాటిని గూర్చి ప్రచురము చేసిరట (2)
సంబరమే సంబరమే ఊరు వాడ సంబరమే
గొల్లల పాటల నాట్యముతో చేసరింక సంబరమే
సంబరమే సంబరమే ఊరు వాడ సంబరమే
సంబరమే సంబరమే లోకమంత సంబరమే (2)

నల్లని నింగిలోన తెల్లని తార వెలసి
జ్ఞానులకు దారిసూపే బాలయేసు నొద్దకు (2)
బాలుని చూసి వారు అత్యానందబరితులై
బంగారం సాంబ్రాణి బోళమును ఇచ్చిరి (2)
సంబరమే సంబరమే ఊరు వాడ సంబరమే
జ్ఞానులు కానుకలర్పించి  చేసరింక సంబరమే
సంబరమే సంబరమే ఊరు వాడ సంబరమే
సంబరమే సంబరమే లోకమంత సంబరమే (2)

------------------------------------------------
CREDITS : 
------------------------------------------------