5439) సంబరానికి అంబరమంతా అదిరిపోవాలి

** TELUGU LYRICS **

సంబరానికి అంబరమంతా అదిరిపోవాలి
యేసురాజుని జన్మవార్తను చాటిచెప్పాలి (2)                                                                                          
మనమందరము వెళదాము ఈ శుభవార్త చెబుదాము (2)

దూత తెచ్చెను ఒక శుభవార్త గొల్లలకిచ్చెను ఆవార్త 
యేసే లోకానికి రక్షకుడు అని యేసే పాపము కడుగునని (2)
మనమందరము వెళదాము ఈ శుభవార్త చెబుదాము (2)
||సంబరానికి||

తార చెప్పెను ఒక శుభవార్త జ్ఞానులు పొందెను  ఆవార్త 
యేసే యూదులకు రారాజు అని లోక రాజ్యాలు యేలునని (2)
మనమందరము వెళదాము ఈ శుభవార్త చెబుదాము (2)
||సంబరానికి||

------------------------------------------------
CREDITS : Vocals : Nissy John
------------------------------------------------