5440) చీకటి కమ్మెనే ఈ లోకంలో ఆజ్ఞను మీరగా ఏదేనులో

** TELUGU LYRICS **

చీకటి కమ్మెనే ఈ లోకంలో ఆజ్ఞను మీరగా ఏదేనులో
రక్షకుడొచ్చెనే మన రూపంలో విడుదలనిచ్చెనే తన రక్తంలో 
ఈ లోకమునే వెలిగింపనూ
ఆ మహిమనే వీడెనూ
జగమంతా సంబరమే మొదలాయెనే
జయధ్వనులే చేయాలి మన యేసుకే (2)

నిరీక్షించే కన్నుల ఎదురుచూపు ఇతడే 
నిత్యజీవమిచ్చే మోక్షమార్గం ఇతడే (2)
జనియించే రాజుగా భువినే పాలించ రా
భారములే బాపరా వచ్చెను మెస్సయ్యగా 
||ఈ లోకమునే||

పాతవన్ని పోయెను క్రొత్తవిగా మారెను 
నిత్య నిబంధననే మనకు ఇచ్చెను (2)
మార్చెను కన్నీటినీ మహిమలో నాట్యముగా
నమ్మిన ప్రతివారినీ మార్చెను తన స్వాస్థ్యముగా 
||ఈ లోకమునే||

--------------------------------------------------------------------------------------
CREDITS : Lyrics, Music, Vocals : Davidson Gajulavarthi
-------------------------------------------------------------------------------------