5489) రక్షకుండు పుట్టాడు శిక్షణోడగొట్టాడు

** TELUGU LYRICS **

రక్షకుండు పుట్టాడు శిక్షణోడగొట్టాడు (2)
పాకలోన పుట్టి  సూడ సక్కనైన సిన్నోడు 
వెళ్లి వద్దాం తమ్ముడు మనమెల్లి సూద్దాం తమ్ముడు (4)

ఆ... ఆకాశమే సింహాసనము - భూమియే తన పాద పీఠము 
నోటిమాటతో సృష్టి చేసి శాసించగలిగిన సమర్ధుడు (2)
అంతగొప్ప దేవ దేవుడు మనకై అరుదెంచిన రోజు (2)
వెళ్లి వద్దాం తమ్ముడు మనమెల్లి సూద్దాం తమ్ముడు (4)

గొప్పవాడు రాజుల రాజు మనసున్న మహారాజు 
నీవు నేను చేరలేమని మనల చేరా వచ్చాడు (2)
అంత గొప్ప ప్రేమామయుడు మనకై అరుదెంచినరోజు (2)
వెళ్లి వద్దాం తమ్ముడు మనమెల్లి సూద్దాం తమ్ముడు (4)

జామురాతిరి సలి మంటలతో గొల్లలే సలి కాయుచుండగా 
గొప్ప వెలుగు వారిని కమ్మి ఒకరికొకరు కలవరపడగా (2)
దూత చెప్పిన మాటను వినిరి గంతులేయుచు సూడవెళ్లిరి (2)
వెళ్లి వద్దాం తమ్ముడు మనమెల్లి సూద్దాం తమ్ముడు (4)

-----------------------------------------------------------
CREDITS :  Music : KJW Prem
 Lyrics, Tune, Vocals : Smt Nssy Paul
-----------------------------------------------------------