5488) కనులారా చూడండి నోరార పాడండి

** TELUGU LYRICS **

కనులారా చూడండి నోరార పాడండి
మనసార మ్రొక్కి ఆరాదించండి రాజు పుట్టాడని
పరవశులై ఆడండి ఊరువాడ అంత చాటింపెయ్యండీ 
దేవదేవుని ఏక కుమార
నరులనంత రక్షింపను గోర
మానవునిగా లోకములో జన్మించెరా
రాజితంబగు తేజోమయుడు 
రాజభోగములు వదిలినాడు 
రాయబారిగా రాజ్యము ఇవ్వను వచ్చెరా
మారేడు పుట్టాడు ఈనాడు 
దివి వదిలి భూవికే వచ్చెసాడు (2)

భయపడకు మరియమ్మ ఇస్తావు నువ్వు జన్మ 
అని దూత పలికింది ఒక శుభవార్తా 
మార్గాన్ని తెలుపుటకు కదిలోచ్చే ఒక తార 
పాకపై ఆగింది తన గమ్యానా 
ఇమ్మానుయేలని పేరు పెట్టుము 
పేరుకు అర్థం దేవుడు మనకు
తోడుగా ఉన్నాడని నువ్వు  ప్రకటించరా

మారేడు పుట్టాడు ఈనాడు 
దివి వదిలి భూవికే వచ్చెసాడు (2)
పరలోక పాలకుడు 
భూలోక సేవకుడై 
మన పాప భారము మోయుటకు వచ్చాడు 
ఈ మర్మమును విడకు
మరువకుము కడవరకు
ఈ సూత్రమే నిన్ను చేర్చును పరమునకూ
మార్గము సత్యము జీవము తానై
లోకాన్ని నడిపే లోక రక్షకుడు 
హృదయాన్నే  కానుకగ అర్పించరా

మారేడు పుట్టాడు ఈనాడు 
దివి వదిలి భూవికె వచ్చెసాడు (2)

దేవదేవుని ఏక కుమార
నరులనంత రక్షింపను గోర
మానవునిగా లోకములో జన్మించెరా
రాజితంబగు తేజోమయుడు 
రాజభోగములు వదిలినాడు 
రాయబారిగా రాజ్యము ఇవ్వను వచ్చెరా

మారేడు పుట్టాడు ఈనాడు 
దివి వదిలి భూవికే వచ్చెసాడు (2)

----------------------------------------------------------------------------
CREDITS : Tune, Lyrics, Music : Dr.Sam Jaysheel 
----------------------------------------------------------------------------