5547) రాజుల రాజు యేసు రాజు పుట్టెను

** TELUGU LYRICS **

రాజుల రాజు యేసు రాజు పుట్టెను 
రాజుల రాజు గొప్ప రాజు పుట్టెను (2)
లోకమంతట గొప్ప వెలుగు తెచ్చెను 
రారే నేడు మనం చూడబోధము 
రారే నేడు క్రీస్తుని చేరాభోదము (2)
||రాజుల||

సర్వ జనుల పాపములను తొలగించెను 
నశియించు ప్రతి మనిషికి రక్షణనిచ్చును (2)
కరుణ గల దేవుడు కరణ జన్ముడు యేసు 
మానవ అవతారిగా మనకోసము వచ్చెను (2)  
||రారే||

మనకోసమే అయన జన్మించెను 
తన ప్రేమను మనపై చూపించెను (2)
మహిమగల దేవుడు మహిమోన్నతుడు 
పశువుల పాకలో పావళించెను (2) 
||రారే||

కోటి కాంతుల వెలుగుతో ఉదయంచెను 
లోకమంత ప్రతి ఉదయం చిగురించెను (2)
దివిని విడిచి భూవికై మనకై దిగివచ్చెను 
లోకమంత ఇదే పార్వదినము ప్రతిక్షణము (2) 
||రారే||

------------------------------------------------
CREDITS : Vocals : Nayomi
------------------------------------------------