5481) ప్రేమకు ప్రతి రూపమా నా యేసయ్యా

** TELUGU LYRICS **

ప్రేమకు ప్రతి రూపమా నా యేసయ్యా
పరమును విడిచి భువికేతెంచితివ (2)
సర్వోన్నత స్థలములలో దేవునికే మహిమ 
అయనకు ఇష్టులైన వారికి సమాధానము (2)

ఆశ్చర్య కరుడవు ఆలోచన కర్తవు 
నిత్యుడుగు తండ్రివి బలవంతుడైనా దేవుడవు (2)
పశువుల పాకలో పశువుల తొట్టిలో (2)
పాప రహితునిగా పరుండినావ (2)
||సర్వోన్నత||

నజరేతువాడవు - మరియ తనయుడవు
పరిశుద్ధుడవు - ఇమ్మానుయేలు దేవుడవు (2)
దావీదు పురములో - బేత్లేహేముఊరిలో (2)
లోక రక్షకునిగా - జన్మించినావా (2) 
||సర్వోన్నత||

సర్వోన్నతుడవు - సర్వసృష్టికర్తవు 
సర్వశక్తిమంతుడవు - ఇశ్రాయేలు దేవుడవు (2)
గోల్గతా స్థలములో - లోకపాపముకై  
అమరమూర్తిగా - అమరుడైనవా (2)  
||సర్వోన్నత||

-----------------------------------------------------------------------------------
CREDITS : Vocals : Tony Prakash, Rakesh Medikonda
Lyrics & Music : Daniel Patibandla & Tony Prakash
-----------------------------------------------------------------------------------