5511) పశువుల పాకలో నిరుపేదగాను తేజోమయుడు

** TELUGU LYRICS **

పశువుల పాకలో నిరుపేదగాను
తేజోమయుడు శిశువుగా పుట్టెను  (2)
ఆనందంగా హల్లెలూయా పాడెదం
సంతోషంగా ప్రభువుని స్తుతించెదం 
Happy Christmas - Marry Christmas
Happy Christmas - Marry Christmas 

స్తుతులకు తగిన పరిశుద్ధుడు అతడు
దూతల స్తుతులు పొందెను చూడు 
నశించువారిని రక్షింప వచ్చెను
ధరలో మన దోషములను పోగొట్టను 

యూదులు రాజు ఇల పుట్టెను చూడు
లోకమంతటికి వెలుగు కలిగెను నేడు
అనాది వాక్యమే నర రూపమాయెనా
రాజాధి రాజుగా బేత్లెహేము పురమున

-----------------------------------------------------------------
CREDITS : Vocals : Folk Singer Srinidhi 
Lyrics, Tune, Music : Symonpeter Chevuri
-----------------------------------------------------------------