5510) ఒక వింత తార వెలిసెను ఆ గగనంలో

** TELUGU LYRICS **

ఒక వింత తార వెలిసెను ఆ గగనంలో
ప్రభు యేసు రాక జరిగెను భూలోకంలో (2)
రండి రారండి ఆరాధించుటకు
రండి రారండి రక్షణ పొందుటకు (2)

మలినమై మాసిన మన బ్రతుకులను
కడిగెను హిస్సోపుతో మన ప్రభు యేసు (2)
వింతైన ఆ ప్రేమను నే చూడ 
వికశించెను నా బ్రతుకు పరిమలమై (2)
ప్రభుకు చేసేదం స్తుతి గానము అన్ని వేళలా స్తోత్రనాధము (2)
||ఒక వింత తార||

శాపముతో భారమైన మన బ్రతుకులను 
రక్షించి విశ్రాంతి నిచ్చెను ప్రభువు (2)
వింతైన ఆ కరుణను నే చూడ ఉల్లసించి నా బ్రతుకు పరవసమై (2)
ప్రభుకు చేసేదం స్తుతి గానము అన్ని వేళలా స్తోత్రనాధము (2)
||ఒక వింత తార||

----------------------------------------------
CREDITS : 
----------------------------------------------