** TELUGU LYRICS **
పరిశుద్ధమైన క్రిస్మస్ పరిశుద్ధుని క్రిస్మస్
పవిత్రమైన క్రిస్మస్ శుభమిచ్చు క్రిస్మస్
సంబరాల క్రిస్మస్ సంతోషాల క్రిస్మస్
ఆనందాల క్రిస్మస్ మన అందరి క్రిస్మస్
కలగన్నాను నేను కలగన్నాను
పరమునుండి పరమాత్ముడు దిగి వచ్చెను
నరునిగా ఇలలో అవతరించి
ఈ లోకాన్ని రక్షింప రక్షకుండాయెను
పశుల పాకలో మరియ చేతిలో శిశువుండగా
గొర్రెల కాపరులు వెళ్లి ప్రభువును కొనియాడిరి
తారను వెంబడించి జ్ఞానులు బేత్లహేము చేరి
బాలుడున్న చోటును తెలుసుకొని ఆనందంతో
ప్రభుకు మోకరించి కానుకలు సమర్పించిరి
పరలోక దూతలంతా క్రిస్తు తోనే ఉండి
ప్రభువులకు ప్రభువును మహిమపరచిరి
భూ నివాసులంతా భూపతిని ఆరాధించగా
క్రీస్తు మహిమ వారి మీద ప్రకాశించెను
సర్వ సృష్టికి మూలమైయున్నవాడా
జన్మతో నీ జన్మతో లోకము వెలుగయెను
నీ రాకతో ఈ జనుల పాపాలు తొలగునని
పరవశముతో నీ సన్నిధిలో నాట్యమాడిరి
పవిత్రమైన క్రిస్మస్ శుభమిచ్చు క్రిస్మస్
సంబరాల క్రిస్మస్ సంతోషాల క్రిస్మస్
ఆనందాల క్రిస్మస్ మన అందరి క్రిస్మస్
కలగన్నాను నేను కలగన్నాను
పరమునుండి పరమాత్ముడు దిగి వచ్చెను
నరునిగా ఇలలో అవతరించి
ఈ లోకాన్ని రక్షింప రక్షకుండాయెను
పశుల పాకలో మరియ చేతిలో శిశువుండగా
గొర్రెల కాపరులు వెళ్లి ప్రభువును కొనియాడిరి
తారను వెంబడించి జ్ఞానులు బేత్లహేము చేరి
బాలుడున్న చోటును తెలుసుకొని ఆనందంతో
ప్రభుకు మోకరించి కానుకలు సమర్పించిరి
పరలోక దూతలంతా క్రిస్తు తోనే ఉండి
ప్రభువులకు ప్రభువును మహిమపరచిరి
భూ నివాసులంతా భూపతిని ఆరాధించగా
క్రీస్తు మహిమ వారి మీద ప్రకాశించెను
సర్వ సృష్టికి మూలమైయున్నవాడా
జన్మతో నీ జన్మతో లోకము వెలుగయెను
నీ రాకతో ఈ జనుల పాపాలు తొలగునని
పరవశముతో నీ సన్నిధిలో నాట్యమాడిరి
----------------------------------------------------------------
CREDITS : Lyrics : Polisetty Bhaskar Rao
Vocals & Music : JaySri & G.R. Naren
----------------------------------------------------------------