5473) ఇమ్మానుయేలనువాడా ఇశ్రాయేలు విమొచకుడా

** TELUGU LYRICS **

ఇమ్మానుయేలనువాడా ఇశ్రాయేలు విమొచకుడా 
ఇమ్మానుయేలనువాడా  
ఇశ్రాయేలు విమొచకుడా రాబోవు రాజువు మమునేలువాడవు
మా కొరకై  భూవి కొచ్చిన దివ్య తేజూడా  
||ఇమ్మానుయేలనువాడా||

వేసారిన బ్రతుకులకు వెలుగువు నీవు
నిను చేరిన మా కొరకు దరియైనావు (2)
భయమును తీసి అభయము నిచ్చి
నిను చూపే తారగా మము నిలిపితివి (2)
||ఇమ్మానుయేలనువాడా||

సర్వోన్నత స్థలములలో దేవునికి మహిమా ఘనత
నేను గనిన మా బ్రతుకులో విరిసెను మమత 
మహిమను విడచి మహికి దిగివచ్చి 
మా పాపము పరిహరించి శాంతి నిచ్చేను
||ఇమ్మానుయేలనువాడా||

--------------------------------------------------------------------------------------------------
CREDITS : Lyrics : Sis. Sharon Mohan Palisetty
Vocals & Music : Palisetty Nithya Hasini & Bro. J. Anand Kumar
--------------------------------------------------------------------------------------------------