5475) జగముల నేలే రారాజు మహిమను విడచి ఏతెంచె

** TELUGU LYRICS **

జగముల నేలే రారాజు మహిమను విడచి ఏతెంచె
సర్వోన్నతుడగు దేవుడే భువిలో శిశువుగా జన్మించే 
కలిగేను రక్షణ నేడే లోకానికి సంబరమే 
హృదిలోన కాంతులు నిండే మహా దానంద మానందమే
లల లాలా లల లాలా లాలా లల లాలా 
హ్యాపీ హ్యాపీ క్రిస్మస్  
లల లాలా లల లాలా లాలా లల లాలా 
మెర్రీ మెర్రీ క్రిస్మస్

దూతగణములు కొనియాడిరి నేడు రక్షకుడేసు పుట్టేనని  
గొల్లలు యేసుని చూచిరి రక్షణ వార్తను ప్రకటించిరి
ఇమ్మానుయేలై తోడుగ వచ్చిన యేసయ్య ను హృదిలో దాచుకో
కనులారా చూడ వేగమే రండి కన్నీళ్ళను తుడిచే రాజుని 
మనసార నిను కోలేచేము సంతోషమే దొరికేను 
శుభవార్త చాటి చెప్పుదాo ఇలలో
ప్రభు చెంతనే ఉండoగా ఇక చింతలే లేవంట 
జగమంత సంబరాల వేడుక

ఓ....ఆ దివ్య తారను కనుగొంటిరి 
జ్ఞానులే ఘనుడను ఘనరచెను 
సాగిల పడెను పూజించెను ఘనమైన కానుకలర్పించెను 
వేగమే రండి యేసుని చేర మనసార ఆరాధించుటకు 
ఆయన వెలుగులో సాగుము నిరతం సర్వస్వం అర్పింతుము 
ఆనందమే దొరికింది - సంతోషమే కలిగింది రాజాధి రాజు రాకతో భువిలో 
ఉల్లాసమే నిండిoది - ఉత్సాహమే పొంగింది 
ఆనంద గీతికలే పాడుదాం

దైవ ప్రేమను రుచి చూడవా యేసుని జననమే కద సాక్షము 
పాప భారము మోయగ పరమును వీడిన పరమాత్ముడు
ఈ క్షణమే ప్రభుని స్వీకరించు రక్షణకది మార్గము 
మారిన మనసుతో వెంబడించు జీవము గల దేవుని 
మన పాపమంతా కడిగి మన శాపమంతా తుడిచి
నజరేయుడేసు హత్తుకొను నిన్ను 
నలు దిక్కుల ప్రకటిద్ధాం నిజ దేవ దేవుని వార్త 
దక్కేను గొప్ప నిత్య జీవము

-------------------------------------------------------------
CREDITS : Lyrics: Bro. Manoj Kothuri
Music : Linus Madiri
-------------------------------------------------------------