5493) పరలోకంలో దూతలు ప్రవక్తలు పరిశుద్దులు

** TELUGU LYRICS **

పరలోకంలో దూతలు ప్రవక్తలు పరిశుద్దులు
భూలోకంలో గొల్లలు జ్ఞానులు పిల్లలు పెద్దలు 
రారాజు పుట్టేనని సంబరాలు సంబరాలు ఇంటింటా సంబరాలు
రారాజు పుట్టేనని సంబరాలు సంబరాలు పరలోక సంబరాలు
ఆనందమే ఆశ్చర్యమే రక్షకుడు జన్మించేనే
పాపులము పరిశుద్దులుగా చేసి పరలోక భాగ్యమిచ్చేనే (2)

ఆ రాతిరి చలిరాతిరి యోసేపు మరియమ్మ కన్నీళ్లతో నిండెనుగా
ఈ రాతిరి శుభరాత్రి మన అందరి హృదయాల్లో వెలుగులతో నింపెనురా (2)
గోళ్ళలంత భయముతో జ్ఞానులంత దిగులుతో సృష్టి అంతా మౌనమాయేరా
చీకట్లు తొలగింప పాపాలను విడిపింప రక్షకుడు జన్మించేరా
||ఆనందమే||

ఈ లోకం నీతిమంతునికి యోగ్యమైనది కానేకదురా
దుష్టులకు ఉరులును బంధకాలు కాచుకుని నిత్యం ఉన్నవిరా (2)
శ్రమ అయిన నిలబడు కష్టమైన భరియించు పరిశుద్ధుల విందున్నదిరా
యుగసమాప్తి వరకు మిమ్ములను విడువనని పరిశుద్ధుడు మాట ఇచ్చేరా
||ఆనందమే||

------------------------------------------------
CREDITS : Sis. Rani Karmoji
------------------------------------------------