** TELUGU LYRICS **
నింగిలో - తూర్పున ఒక తారే వెలిసెను
తూర్పున - జ్ఞానులకు త్రోవను చూపను
తూర్పున - జ్ఞానులకు త్రోవను చూపను
||నింగిలో||
లోక రక్షకుడు - జన్మించే మన కోసము
దీనుడై ఉదయించే ఈ లోకము
మహిమ సింహాసనాశీనుడు
ప్రేమతో పాకలో మన కోసము (2)
||నింగిలో||
చీకటిలో ఉన్న - గొల్లలపై - ప్రభువు మహిమ
ఉదయించెను
భయపడవలదు - శుభ వార్తని
దూతలెల్లరు - ప్రకటించిరి (2)
పరుగు పరుగున వెళ్ళిరి
గొల్లలు - రక్షకుని చూడాలని
తాము కన్న విన్న వాటిని
రాత్రివేళ - ఊరంతా ప్రకటించిరి (2)
||నింగిలో||
ఉత్సాహముతో సాగిరి
జ్ఞానులు తారను చూచి
యూదా దేశపు - బెత్లెహేమున
గొప్ప రాజు - జన్మించెనని
సామాన్యుడు కాడని - యేసుకు
సాగిల పడి - మ్రొక్కిరి
బంగారు, సాంబ్రాణి
భోళము - అర్పించి
మనసారా పూజించిరి (2)
||నింగిలో||
------------------------------------------------------------------------------
CREDITS : Lyrics, tune : Dr. Jayababu
Vocals & Music : Baby Jayababu & Samuel mories
------------------------------------------------------------------------------