5566) నూతన సంవత్సరములోకి నను నడిపించిన యేసయ్య

** TELUGU LYRICS **

నూతన సంవత్సరములోకి 
నను నడిపించిన యేసయ్య
నూతన వాగ్దానములనిచ్చి 
నను దీవించిన యేసయ్య
క్రొత్త సృష్టిగా మార్చిన దేవా
క్రొత్త బలముతో నింపిన ప్రభువా (2)
నీకై జీవింతునయ్య
నిత్యము నిన్ను కీర్తింతునయ్య
నీ ప్రేమను ప్రకటింతునయ్య
||నూతన||

గడచిన కాలమంతా 
నీ దయా కిరీటము నుంచి
బ్రతుకు దినము లన్నిటను 
నీ కృపా క్షేమములనిచ్చి (2)
కుడి ఎడమల ఆవరించి ఆశ్రయమై భద్రపరచి
ఉల్లాస వస్త్రమును ధరియింపజేశావు
ఉన్నత స్థానములో నను నిలిపి నావు (2)
క్రొత్త సృష్టిగా మార్చిన దేవా
క్రొత్త బలముతో నింపిన ప్రభువా (2)
నీకై జీవింతునయ్య నిత్యము
నిన్ను కీర్తింతునయ్య
నీ ప్రేమను ప్రకటింతునయ్య 
||నూతన||

పాతవి గతియింపజేసి 
సమస్తము నూతన పరచి
రక్తముతో విడిపించి 
నీ వాక్యముతో నడిపితివే (2)
మేలులతో తృప్తి పరచి
ఆనందతైలముతో నింపి (2)
రాజుల వంశములో నను చేర్చినావు
శత్రు బలమంతటిపై జయమిచ్చినావు (2)
క్రొత్త సృష్టిగా మార్చిన దేవా
క్రొత్త బలముతో నింపిన ప్రభువా (2)
నీకై జీవింతునయ్యా 
నిత్యమునిన్ను కీర్తింతునయ్య
నీ ప్రేమను ప్రకటింతునయ్యా 
||నూతన||

---------------------------------------------------------------
CREDITS : Music : KJW prem
Lyrics, Tune, Vocals : Rajini Das. Saathri
---------------------------------------------------------------