5457) నీవు గాక నాకెవరున్నారయ్యా నీవు లేని క్షణము నీ బ్రతుకగలనా

** TELUGU LYRICS **

నీవు గాక నాకెవరున్నారయ్యా నీవు లేని క్షణము నే బ్రతుకగలనా (2)
నీవులేని ఈ జీవితం ఎండిన ఎడారి నా బ్రతుకు (2)
ఆధారము నీవే యేసయ్యా
ఆశ్రయము నీవే నా యేసయ్య
నా బలము నీవే యేసయ్య
నా బంధము నీవే నా యేసయ్యా
||నీవుగాక||
                                         
ఒంటరినై నేను మిగిలిపోయిన-ఓదార్పు లేక ఒరిగిపోయిన (2)
రక్తసంబధమే నను మరచిన- నను ఎన్నడు మరువని నా దేవుడవు (2)
||ఆధారము||

నిరాశలే  ఎన్నెన్నో ఎదురైనా-నిట్టూర్పులే మిగిలినా (2)
కన్నీరే నన్ను కృంగదీసిన- నను ధైర్యపరచిన నా దేవుడవు (2)
||ఆధారము||

ఆపదలే నన్ను ఆవరించిన-మరణఛాయలే నన్ను ఆలముకున్ననూ (2)
ఎద నిండ వెేదన నిండిపోయినా-నను
ఆదరించిన నా దేవుడవు (2)
||ఆధారము||

---------------------------------------------------------------------
CREDITS : Vocals : Lilian Christopher
Lyrics & Music : Pas. Anil Kumar & Jhon Lal
---------------------------------------------------------------------