5456) రావా దేవా నా ప్రేమామయుడా

** TELUGU LYRICS **

రావా దేవా నా ప్రేమామయుడా
నీ ప్రేమ ఒడిలో నన్ను చేర్చుమా

వినుమా దేవా నా దీన ప్రార్ధన
కనుమా ప్రభువా నా ఆవేదన
ఎలుగెత్తి నిను నేను పిలచుచున్నాను
దరిచేరి నీవు నాకు దారిచూపుమా

రావా దేవా నా ప్రేమామయుడా
నీ ప్రేమ ఒడిలో నన్ను చేర్చుమా
నేను సేదతీరెద

నీ తోడులేక నీ నీడలేక
అల్లాడిపోయేనే నా మనసు
నీ వాక్య ధ్యానమును మరచిపోతిని
దినమంత నిరాశతో కృంగిపోతిని

నీ ఊసులేక నీ ధ్యాసలేక
వేసారిపోయేనే నా బ్రతుకు
నీ ప్రేమ బాటను విడనాడితిని
రేయంత రోధనతో నిట్టూర్చితిని

--------------------------------------------------------------------------
CREDITS : SMJ CREATIONS/ penitential Hymn
--------------------------------------------------------------------------