** TELUGU LYRICS **
మహ సంతోషము ప్రజలందరికి సువర్తమానము (2)
సువర్తమానము సంతోష సమాధానముల
సుమహారము మనోహరము మహోనతము ప్రభుయేసుని చరితము (2)
అ. ప మహాసంతోషము ప్రజలందరికి సువర్తమానము
సువర్తమానము సంతోష సమాధానముల
సుమహారము మనోహరము మహోనతము ప్రభుయేసుని చరితము (2)
అ. ప మహాసంతోషము ప్రజలందరికి సువర్తమానము
మనపాపాన్ని శాపాన్ని కడగ గలిగిన సువర్తమానము
హోసన్న... హోసన్న.... హోసన్న హోసన్న... హోసన్న.... హల్లెలూయ
పరము నుండి దిగివచ్చెను పరిశుద్దతనయుడు
ప్రజలందరికి పంచిపెట్టగ తన ప్రేమను (2)
ఈ రక్షణ వర్తమానము మనముంగిట కొచ్చెను (2)
ప్రజలందరితో ఒక్కడాయెను - ప్రేమ వాక్యము ప్రభోదించెను
పాపాలనుండి విడిపించెను - రోగాల నుండి స్వస్థపరచెను (2)
ఈ రక్షణ వర్తమానము మనముంగిటకొచ్చెను (2)
తన రక్తమును మనకై చిందించి రక్షణ భాగ్య మిచ్చెను
పరమున మనకై నివాసములు సిద్ధపరచవెళ్ళెను (2)
ఈ రక్షణ వర్తమానము మనముంగిట కొచ్చెను (2)
---------------------------------------------------------------
CREDITS : Lyrics : Jessi Wilson Juthuka
Music, Tune, Vocals : Pakalapati Suresh
---------------------------------------------------------------